Header Banner

ప్రధాని సమక్షంలో కొత్త రికార్డు దిశగా చంద్రబాబు! కీలక నిర్ణయం..!

  Wed May 21, 2025 13:28        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు కొత్త రికార్డు దిశగా కార్యాచరణ ఖరారు చేసారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని మోదీని ఇప్పటికే చంద్రబాబు విశాఖ కు ఆహ్వానించారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగా దినోత్సవం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాని మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు ఇచ్చారు.


యోగా డే నాడు

అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్‌ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష , పట్టుదలతో చేస్తున్నారన్నారు. నేటి (బుధవారం) నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర -2025పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిం చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తామని.. ఉదయం 7 నుంచి 8 గంటలకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో యోగ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.



ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

యోగా ద్వారా

యోగా వల్ల మానసిక ప్రశాంత ఏర్పడిందని అన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమో ట్ చేస్తున్నారని తెలిపారు. 26 జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రచార కార్యక్రమా లు నిర్వహిస్తామన్నారు. మీడియా కూడా యోగాను ప్రమోట్ చేసేందుకు కృషి చేయాలని కోరారు. 2,500 మందిని మాస్టర్ ట్రైనర్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మంది యోగాలో ప్ర‌వేశించేలా అవ‌గాహ‌న, శిక్ష‌ణ ఇవ్వనున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామ‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం శిక్ష‌ణ‌, అభ్యాసం చేస్తారు. యోగాలో శిక్ష‌ణ పొందిన క‌నీసం 20 ల‌క్ష‌ల మందికి స‌ర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ హించనున్నారు. జూన్ 21న విశాఖ ఆర్‌కే బీచ్‌లో జ‌రిగే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుకల్లో..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.


ఇది కూడా చదవండి: ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #ChandrababuNaidu #PrimeMinister #NewRecord #KeyDecision #APPolitics #TeluguPolitics #TDP